![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -405 లో.. ముకుంద ఎందుకు ఇలా చేస్తుందని మురారి తన మాటలు గుర్తుకు చేసుకొని ఆలోచిస్తుంటాడు. మరొకవైపు ముకుంద ఆదర్శ్ ఇచ్చిన కాఫీని హ్యాపీగా తీసుకుందేంటి.. ఆదర్శ్ అంటే ఇష్టమేనా లేక నేను తప్పుగా ఆలోచిస్తున్ననా అని కృష్ణ అనుకుంటూ డిప్ థింకింగ్ లో ఉంటుంది. మురారి కూడా ఆలోచిస్తుంటాడు. కాసేపటికి మురారి దగ్గరకి కృష్ణ వచ్చి చెక్కెలిగింతలు చేస్తుంది. దాంతో మురారి కోపంగా.. ఎప్పుడు ఇలా పిచ్చిగా చేస్తావా అంటు సీరియస్ అవుతాడు.
ఆ తర్వాత మురారి తనపై సీరియస్ అవడంతో కృష్ణ ఏడుపు మొహం పెడుతుంది. అంతగా ఏం ఆలోచుస్తున్నారని కృష్ణ అడుగుతుంది. కృష్ణకి ముకుంద గురించి తెలిస్తే బాధపడుతుందని మురారి అనుకొని.. ఏం లేదు మన శోభనం గురించి ఆలోచిస్తున్నాని మురారి అంటాడు. ఎందుకు అంత సీరియస్ అయ్యారు. ఇంకొకసారి నాపై సీరియస్ అవ్వకండి అని కృష్ణ మురారికి కృష్ణ చెప్తుంది. మరొకవైపు మధు తన ఫ్రెండ్ తో ఫోన్ లో ఈ రోజు వస్తాను అన్ని అరేంజ్ మెంట్స్ చేయండి అని మాట్లాడుతుంటే.. అప్పుడే రేవతి వచ్చి.. ఏంటి రా వెళ్ళేది ఈ రోజు ముకంద, ఆదర్శ్ ల శోభనం ఏమైనా అవసరముంటే ఎవరు తీసుకొని వస్తారని రేవతి అంటుంది. ఈ శోభనం జరగదు. ముకుందకి ఇష్టం లేదని మధు అంటాడు. ఆ తర్వాత ముకుంద తన గదిలో మురారిని ఉహించుకొని రొమాంటిక్ గా డాన్స్ చేస్తుంటే.. అప్పుడే కృష్ణ వచ్చి ఏంటి ఇంత హుషారుగా ఉందని అనుకుంటుంది. ముకుంద నాకు హెల్ప్ చేస్తవా ఈ రోజు బ్రేక్ ఫాస్ట్ చేస్తావా అని కృష్ణ అనగానే.. సరే చేస్తాను అని ముకుంద వెళ్లి చేస్తుంది. ఆ తర్వాత ముకంద గురించి కృష్ణ ఆలోచిస్తుంటుంది. మురారి వచ్చి ఆనియన్ దోస చేసావా అని అడుగుతాడు. ముకుంద చేస్తుందని కృష్ణ చెప్పగానే.. తను ఎందుకు చేస్తుంది నువ్వు చెయ్ అనగానే తను ఎందుకు చెయ్యకూడదని కృష్ణ అంటుంది. నాకు ఇష్టమైంది ముకుంద చెయ్యడమేంటని మురారి కోపంగా ముకుంద దగ్గరికి వెళ్తాడు.
అక్కడికి వెళ్ళిన మురారిని.. ఆదర్శ్ ని ఇంట్లో నుండి పంపే ప్రయత్నం ఎంత వరకు వచ్చిందని ముకుంద అడుగుతుంది. అతన్ని పంపించి మనం ఒకటి అవుదామని మురారిపై ప్రేమని ముకుంద చెప్తుంటే మురారి ముకందపై చెయ్ లేపుతాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా అని మురారి అంటాడు. వాళ్ళ మాటలని కృష్ణ విని షాక్ అవుతుంది. తరువాయి భాగంలో కృష్ణ, మురారి ఇద్దరు కలిసి ముకుందకి కౌంటర్ ఇస్తారు. మీతో పాటు మా శోభనం కూడా ఈ రోజు జరుగుతుందని కృష్ణ, మురారి ఇద్దరు కలిసి ఇంట్లో వాళ్ళకి చెప్పగానే.. వీళ్ళు ప్లాన్ తోనే ఇదంతా చేస్తున్నారని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |